Loan apps:రుణ యాప్‌ వేధింపులకు.. యువకుడు బలి

-

Loan apps: రుణ యాప్‌ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నా.. రుణ యాప్‌ (Loan apps)వేధింపులు తగ్గటం లేదు. ఫలితంగా మానసిక క్షోభతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన ఓ యువకుడు రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, కొత్తకోటకు చెందిన శేఖర్‌(35) ఆర్థిక సమస్యల కారణంగా ఓ లోన్‌ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. కొంతకాలానికి అప్పు తిరిగి చెల్లించినా.. వడ్డీ ఇంకా చెల్లించాలంటూ లోన్‌ యాప్‌ (Loan apps)నిర్వాహకులు శేఖర్‌ను వేధింపులకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా శేఖర్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై, తన గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Read also: జగన్ భజన పై ఉన్న ఆసక్తి.. తన బాధ్యతలపై లేదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...