మహిళ అని చూడకుండా గవర్నర్ పై MLC కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు 

0
Padi Kaushik Reddy

Padi Kaushik Reddy Abuse Comments On Governor TamiliSai: BRS MLC పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్, బీజేపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లుల ఫైళ్ళని ఇప్పటిదాకా గవర్నర్ తన * క్రింద పెట్టుకొని కూర్చుంటారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఫైళ్ళను పాస్ చేయకుండా గవర్నర్ దగ్గరే పెట్టుకుంటున్నారని.. దీనికి బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు. ప్రస్తుతం ఆయన(Padi Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గవర్నర్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏంటో తెలుసుకోవడానికి కింద ఉన్న వీడియో చూడండి.

Read Also:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here