యువగళం సక్సెస్ కోసం ద్వారక తిరుమలకు సాయి కళ్యాణి పాదయాత్ర

0
Sai Kalyani Padayatra

Sai Kalyani Padayatra: వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు, రైతుల సమస్యల పట్ల చైతన్యం తెచ్చేలా ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, యువ నాయకులు నారా లోకేష్ చేప్పట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ హనుమాన్ జంక్షన్ నుంచి ద్వారక తిరుమల వరకు తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. మంగళవారం రాత్రి హనుమాన్ జంక్షన్ లోని అభయాంజనేయస్వామి గుడి నుంచి మొదలుపెట్టిన ఈ పాదయాత్ర బుధవారం రాత్రికి ద్వారక తిరుమలేశుని చేరుకోవడంతో ముగిసింది. ఈ పాదయాత్ర సుమారు 65 కిలోమీటర్లు వరకు నిర్విరామంగా కోనసాగింది.

సంఘీభావ పాదయాత్రలో పాల్గొన్నవారికి ప్రతి గ్రామంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు మద్దతు ప్రకటించడంతో పాటుగా దారిపొడవునా అల్పాహారం, పండ్లు, మంచి నీళ్ళు, బిస్కెట్లు, జ్యూసులు అందజేశారు. ఈ పాదయాత్రలో లోకేష్ తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆయా గ్రామ వైసీపీ నేతలు సైతం సంఘీభావం తెలపడం గమనార్హం.

తొలుత, మంగళవారం రాత్రి, హనుమాన్ జంక్షన్ లోని అభయాంజనేయస్వామి గుడిలో 18 కొబ్బరికాయలు కొట్టిన అనంతరం లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సాయి కల్యాణి తలపెట్టిన సంఘీభావ పాదయాత్ర విజయవంతం కావాలని టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఆకాంక్షించారు. ఈ పూజలో బాపులపాడు మండలం నుంచి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నిర్విరామంగా కొనసాగిన సంఘీభావ పాదయాత్ర బుధవారం రాత్రికి ద్వారక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి చేరుకోవడంతో ముగిసింది. తిరుమలేశుని గర్భగుడిలో లోకేష్ చేప్పట్టిన పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తిఅవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రగణంలో పాదయాత్రలో సాయి కల్యాణితో పాటుగా పాల్గొన్న సభ్యులకు ద్వారక తిరుమల దేవస్థానం వేద పండితులు వారిచే వేదశీర్వచనలు అందజేసిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

Sai Kalyani Padayatra: ఈ సంఘీభావ పాదయాత్ర ముగిసేవరకు సాయి కల్యాణి వెన్నంటే నడిచినవారిలో బాపులపాడు మండల తెలుగు రైతు అధ్యక్షులు తుమ్మల జగన్, టీడీపీ నాయకులు పెందుర్తి శ్రీకాంత్, విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగు మహిళ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పర్వతనేని రత్నశ్రీ, సుధీర్, వినోద్ ఉన్నారు. అలాగే, ఈ పాదయాత్ర ముగిసేవరకు సహాయసహకారాలు అందించిన వారిలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు ఉప్పలపాటి ప్రవీణ్, టీడీపీ శ్రేణులు కంచెర్ల శ్రీకాంత్, గోగినేని అవినాష్ ఉన్నారు.

ఈ పాదయాత్రకి సంఘీభావం తెలిపినవారిలో టీడీపీ నాయకులు కోనేరు నాని, వల్లభనేని సతీష్, అంగన్వాడీ విభాగం రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బొప్పన నీరజ, ఐటీడీపి రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చైతన్య, మహిళలు, తదితరులు ఉన్నారు. అలాగే, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు, ప్రజలు సంగిభవం తెలిపారు.

ఈ సందర్భంగా సాయి కల్యాణి మాట్లాడుతూ, లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని, జగన్ అరాచక పాలన అంతం కావాలని ఆకాంక్షిస్తూ అభయాంజనేయస్వామి గుడి నుంచి ద్వారక తిరుమలేశుని దేవాలయం వరకు సంఘీభావ పాదయాత్ర చేయడం జరిగిందని తెలిపారు. లోకేష్ పాదయాత్రలో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు అండగా నిలబడి విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. లోకేష్ కు రాష్ట్ర ప్రజలు నుంచి అశేష మద్దతు ఉందని, అర్ధరాత్రి చీకటి జీవోలు, షరతులతో కూడిన అనుమతులతో లోకేష్ తలపెట్టిన పాదయాత్రను ఆపలేరని అన్నారు. వైసీపీ నేతలు సైతం లోకేష్ పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాము అని సంఘీభావ యాత్రకు మద్దతు తెలిపారంటే రాష్ట్రాల్లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ గెలుపుని ఆపలేరని అన్నారు. ఈ సంఘీభావ పాదయాత్రలో వెన్నంటే నడిచిన వారికి, ముగిసేవరకు సహాయ సహకారాలు అందించిన వారికి, సంఘీభావం తెలిపిన వారికి, ఆయా గ్రామల్లో మద్దతు తెలిపిన టీడీపీ శ్రేణులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here