ఏం జరిగినా పట్టించుకోను.. అక్కినేని, తొక్కినేని వ్యాఖ్యలపై బాలయ్య రియాక్షన్ 

0
Balakrishna

Balakrishna reacts on Aakkineni thokkineni comments controversy: వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ కూడా ఇచ్చారు. మరోవైపు బాలకృష్ణ కామెంట్స్ ఫ్యాన్ వార్ కి సైతం తెరలేపాయి. గత నాలుగైదు రోజులుగా చర్చనీయంశంగా మారిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు బాలయ్య బాబు స్పందించారు. ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

హిందూపురంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) అక్కినేని తొక్కినేని మాటలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీకి నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ్ళ లాంటి వారన్నారు. నాన్నగారి నుండి క్రమశిక్షణ నేర్చుకున్నానని, ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఫ్లోలో  వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని అన్నారు. నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని, బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందని వెల్లడించారు. బయట ఏం జరిగినా నేను పట్టించుకోనని అన్నారు. నాన్న ఎన్టీఆర్ పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చామని బాలకృష్ణ గుర్తు చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here