Phone Tapping Case | తిరుపతన్న బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ..

-

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) తెలంగాణ అంతటా తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులంతా కూడా బెయిల్ సంపాదించడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారీ వారికి చుక్కెదురవుతోంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై ఈరోజు విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకోసం ప్రభుత్వానికి రెండు వారాల సమయం కేటాయించింది. అనంతరం ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.

- Advertisement -

Phone Tapping Case | గతంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తిరుపతన్న(Tirupathanna).. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ అక్టోబర్ 24న ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తొలుత విచారణలో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన మూడు నెలల తర్వాత కూడా హైకోర్టు ఎందుకు బెయిల్‌ను నిరాకరించిందని న్యాయస్థానం ప్రశ్నించింది. అనంతరం నవంబర్ 27కు విచారణకు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈరోజు విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read Also: సికింద్రాబాద్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్..

Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...