Physical Effiency tests: డిసెంబర్‌ 8 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు

-

Physical Effiency tests starts from december 8 in Telangana for SI, and Constables candidates: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి నియామకాలకు డిసెంబర్‌ 8 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి, ఇప్పటికే ఉచితంగా శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయా అభ్యర్థులు దాదాపు మూడు నెలల నుంచి శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 8 నుంచి జనవరి తొలి వారం వరకూ శారీరక సామర్థ్య పరీక్షలు, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది.

- Advertisement -

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సిద్ధిపేటలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వెసులుబాటు కలిపించారు. ఈ నెల 29 ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 3న రాత్రి 12 గంటల వరకు మండలి వెబ్‌సైట్‌ www.tslprb.in లో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే, 93937 11110 లేదా 93910 05006 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

అడ్మిన్‌ కార్డులో పేర్కొన్న సమయానికి అభ్యర్థి (Physical Effiency tests)కు రాకుంటే.. అభ్యర్థిత్వం రద్దు అవుతుందని అధికారులు హెచ్చరించారు. సామాన్లు భద్రపరుచుకునే క్లాక్‌రూంలు గ్రౌండ్‌ వద్ద అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. మహిళా అభ్యర్థులు నగలు, హ్యాండ్‌బ్యాగ్స్‌ తీసుకురావొద్దని సూచించారు. టాటూలు, మెహిందీ ఉండకూడదని, గ్రౌండ్‌లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. తొలుత రన్నింగ్‌లో పాల్గొని, అందులో క్వాలిఫై అయితేనే ఎత్తు కొలుస్తారు. ఎత్తులో అర్హత సాధించిన వారినే లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...