హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమసక్క సారలమ్మ పౌరుషానికి..రాణిరుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతిగాంచిన.. వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందని.. తెలంగాణలో సైతం బీజేపీ హవా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ(BJP) ట్రైలర్ చూపించామన్నారు. సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తుందని ప్రధాని మోడీ(PM Modi) అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పక్కనబెట్టి.. కేసీఆర్ కేవలం నాలుగు పనులే తెలుసని అన్నారు.
అవి 1. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీ తిట్టడం. 2. కుటుంబం పార్టీని పెంచి పోషించడం. 3. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. 4. తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం.. ఈ నాలుగు పనులే కేసీఆర్‌కు తెలిసింది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ అత్యంత అవినీతి సర్కార్ అని మోడీ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు తెలంగాణలో ఒక్కటి కూడా లేదని సెటైర్లు వేశారు. అభివృద్ధి కోసం గతంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగేవి, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోందని తెలిపారు. ఇప్పుడు అవన్నీ బట్టబయలు అయ్యాయని అన్నారు. వీటి నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు కొత్త వ్యూహాలు పన్నుతోందని వెల్లడించారు. ఆ వ్యూహాలు, ఆలోచనల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also: పొలంలో దిగి, ట్రాక్టర్‌తో దున్నిన రాహుల్ గాంధీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat