PM Modi Telangana Tour|తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పేపర్ లీకు కేసులో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ లీకు కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ అరెస్టును తీవ్రంగా పరిగణించిన బీజేపీ పెద్దలు ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడాలని ఆయనకు భరోసా ఇచ్చారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు.
అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ(PM Modi) ప్రసంగిస్తారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్(KCR), స్థానిక ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కూడా మోదీ పక్కనే కుర్చీలు ఏర్పాటుచేశారు. అయితే వీరిద్దరు ఆ సభకు హాజరుకావడం లేదు. దీంతో మోదీకి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) స్వాగతం పలకనున్నారు. మరోవైపు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంలో అధికార బీఆర్ఎస్ పై విమర్శలు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రారంభిస్తున్న వందే భారత్ రైలు ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకి పర్యాయపదంగా మారింది. సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు పర్యాటకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేషప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడింపజేస్తుంది. https://t.co/UTb7vOQLrP
— Narendra Modi (@narendramodi) April 7, 2023
Read Also: ప్రధాని తెలంగాణ పర్యటన వేళ బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్
Follow us on: Google News, Koo, Twitter