Hyderabad |హైదరాబాద్‌లోని KBR పార్కులో యువ నటిని వెంబడించిన గుర్తు తెలియని యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో వాకింగ్ కోసం ఓ నటి కేబీఆర్ పార్కుకు వచ్చింది. వాకింగ్ చేస్తుండగా ఆమెను ఓ యువకుడు వెంబడించాడు. దీంతో ఆమె పరుగులు తీసి, ఇతరుల సాయంతో అగంతకుడిని పోలీసులకు అప్పగించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని విచారిస్తున్నారు.
Hyderabad |కేబీఆర్ పార్కులో నటిని వెంబడించిన యువకుడు అరెస్ట్
-