Pallavi Prashanth | హైదరాబాద్‌లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసులు సీరియస్

-

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth).. రన్నరప్‌గా అమర్‌దీప్(Amardeep) నిలిచిన సంగతి తెలిసిందే. షో ముగిసిన తర్వాత వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరారు. అయితే అక్కడ భద్రతా వైఫల్యం నెలకొనడంతో కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. స్టూడియో నుంచి బయటకు వస్తున్న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్, ఇతర సెలబ్రిటీల కార్లపై రాళ్లు విసిరారు. కార్ల అద్దాలను పగలగొట్టారు. అంతేకాదు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు కొట్టుకున్నారు కూడా. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలనూ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు .

- Advertisement -

ముఖ్యంగా అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అమర్ కారు అద్దాలు పగలగొట్టి బూతులు తిట్టారు. ఆ సమయంలో కారులో ఉన్న అమర్ తల్లి, భార్య భయంతో వణికిపోయారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడి వెనక ఎవరైనా ఉన్నారా లేదా నిజంగానే వారు అభిమానులా అని తెలియాల్సి ఉంది. అమర్ కారే కాకుండా అశ్విని, గీతూ రాయల్‌పైనా దాడి చేశారు. దీంతో వారి కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆ ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు వారు ఫ్యాన్సే కాదని.. ఎవరో కావలని ఇలా చేశారని మండిపడుతున్నారు. మొత్తానికి ‘బిగ్ బాస్’ షో అటు హౌస్ లోపల జరిగే వ్యవహారాలతో పాటు బయట జరిగిన ఆకతాయిల దాడితోనూ మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆర్టీసీ బస్సుపై దాడి ఘటనను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ‘అభిమానం పేరుతో చేసే పిచ్చిచేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు ‘బిగ్ బాస్ 7’ విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth)కు మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలిచినందుకు గర్వంగా ఉందన్నారు. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకూ అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందని కొనియాడారు.

Read Also: యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్, చంద్రబాబు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...