కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao)ను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం జిల్లాకు సమీపంలోని పెద్దకొడప్‌గల్‌లో రఘునందన్ రావును నిలివేశారు. బిచ్చుందా పోలీస్ స్టేషన్‌లో ఉన్న బీజేపీ నేత రమణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్తుండగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపై రఘునందర్ రావు సీరియస్ అయ్యారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్‌కు సమయం దగ్గర పడిందని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలకు భయం తప్ప తమకు లేదన్నారు.