Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరిక తేదీ ఖరారు!

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. జూన్ 30న ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కూడా హస్తం గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి(Jupally Krishna Rao), కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితర నేతలు భేటీ కానున్నారు.

- Advertisement -

భేటీ అనంతరం తెలంగాణలో వేరువేరు బహిరంగ సభల్లో పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పొంగులేటి(Ponguleti Srinivas Reddy) అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే మహబూబ్‌నగర్ బహిరంగ సభలో జూపల్లి అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. జూపల్లితో పాటు దామోదర్ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి, తదితరులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read Also:
1. దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...