తెలంగాణలో రాజకీయాలు వేసవికంటే ఎక్కువగా వేడెక్కాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy )పై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకేసారి ఇద్దరు అగ్రనేతలపై సీఎం కేసీఆర్ వేటు వేయడంపై రాజకీయ సంచలనానికి దారి తీసింది. కాగా పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ నుండి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. పంజరం నుండి పక్షి బయటకు వచ్చినట్టు అనిపిస్తోందన్నారు. సభ్యత్వం చేస్తాను పుస్తకాలు ఇవ్వమంటే… మూడేళ్ళుగా నాకు పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వలేదు. మరి ఇన్నాళ్లు నేను పార్టీ సభ్యుడిగా ఉన్నట్టా? లేనట్టా అని పొంగులేటి(Ponguleti Srinivas Reddy ) ప్రశ్నించారు. నేను మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పి సస్పెండ్ చెయ్యాలి. నేను మాట్లాడిన మాటలు అబద్దాలు అంటే రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా కాకుండా నన్ను సస్పెండ్ చేశారంటే.. మీ బండారం బయటపడుతుందని సస్పెండ్ చేసినట్టే అని పొంగులేటి వ్యాఖ్యానించారు. కాగా తనని ఎందుకు సస్పెండ్ చేశారు వందిమాగధులు కాకుండా కేసీఆరే(KCR) చెప్పాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: పొంగులేటి, జూపల్లికి కేసీఆర్ భారీ షాక్.. అధికారిక ప్రకటన విడుదల
Follow us on: Google News, Koo, Twitter