అమిత్ షాతో భేటీ ఫిక్స్.. BRS కి పొంగులేటి భారీ షాక్

-

Ponguleti Srinivas Reddy will meet Amit shah On 18 January over Join BJP: టిఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. ఆయన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి బీజేపీలో చేరుతారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. పొంగులేటి అసంతృప్తిని అదునుగా భావించిన బీజేపీ అధిష్టానం ఆయనను తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదిపింది. ఈ క్రమంలో అమిత్ షా(Amit shah) తో పొంగులేటి భేటీకి ముహూర్తం కూడా ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈనెల 18న వీరిద్దరి భేటీ ఫిక్స్ అయినట్టు సమాచారం. అనంతరం పార్టీ మార్పు పై పొంగులేటి అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. కాగా ఈనెల 10న అన్ని నియోజకవర్గాల్లోని తన అనుచరులతో పొంగులేటి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బిజెపిలో చేరడంపై ప్రధానంగా చర్చించనున్నారు పొంగులేటి(Ponguleti Srinivas Reddy). ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BRS కి బలమైన నేతగా ఉన్నారు పొంగులేటి. ఆయన పార్టీ వీడితే కెసిఆర్ కు గడ్డి షాక్ తగిలినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పొంగులేటి ప్రభావం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...