తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత విభేదాలపై మాజీ పీసీసీ చీఫ్, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోల్లో 80 శాతం హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీయండని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇస్తోందని చెప్పారు. తమలాగే గ్యారంటీ కార్డు ఇచ్చే ధైర్యం మిగిలిన పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. అంతేగాక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా విభేదాలున్నాయి. అయినా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాం. ఎప్పుడు, ఏం చేయాలో మాకు తెలుసు. మా పార్టీ విషయాలు ఇతర పార్టీలకెందుకు చెప్పాలి. అది మా పార్టీ ఇష్టం. ఏం చేస్తామో ఇతరులకు ఎందుకు? ఏదైనా ఉంటే ప్రజలకే చెబుతామని పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) పేర్కొన్నారు.
Read Also: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రండి.. చైనా నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం
Follow us on: Google News, Koo, Twitter