ప్రజాభవన్(Praja Bhavan) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ప్రజా భవనాన్ని కేటాయించింది. ఇక నుంచి అది ఆయన అధికారిక నివాసం కానుంది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోను విడుదల చేశారు. త్వరలోనే ఆయన కుటుంబంతో సహా ప్రజాభవన్‌కు వెళ్లనున్నారు.
కాగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతిభవన్(Pragathi Bhavan) ముందున్న ఇనుప కంచెలన అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం జ్యోతిరావు పూలే ప్రజాభవన్(Praja Bhavan)గా పేరు మార్చి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్.. కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఇక్కడి నుంచే ఆయన పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ సమీక్షలు నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది.
#PragatiBhavan, now #PrajaBhavan, once famous as official residence of #TelanganaCM, will not be home to @revanth_anumula; instead it is being allotted to #TelanganaDeputyCM @BhattiCLP as #NewTelanganaCM #RevanthReddy has said he would continue at his own home pic.twitter.com/LhQAxLvfLF
— vanaja morla (@MorlaVanaja) December 13, 2023