హైదరాబాద్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) శీతాకాలబ విడిది ముగిసింది. దీంతో ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క(Seethakka), ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
అంతకుముందు బొల్లారంలోని తన నివాసంలో రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే(Alok Aradhe), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులందరినీ రాష్ట్రపతి పేరుపేరునా పలకరించారు.
కాగా ప్రతి ఏడాది శీతాకాలం విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా డిసెంబరు 18న బొల్లారంలోని నివాసానికి రాష్ట్రపతి(Droupadi Murmu) విచ్చేశారు. పర్యటనలో భాగంగా పోచంపల్లిని సందర్శించారు.