Hyderabad | ట్రాఫిక్ నిబంధనలను అందరూ అలుసుగా తీసుకుంటుంటారు. ప్రమాదమని తెలిసినా పట్టించుకోరు. పోలీసులు మన ప్రాణాలు కాపాడుకోవాలని చెబుతున్నా వినిపించుకోరు. ఈ క్రమంలోనే కొందరు హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, రాంగ్ రూట్‌లో ప్రయాణించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాలు పోగొట్టుకుంటుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు నూటికి 95శాతం ప్రమాదాలు మానవ తప్పిదాలే అని తెలిసినా జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు.
Hyderabad | మరీ ముఖ్యంగా మద్యం సేవించి, సెల్ ఫోన్‌లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. వాహనచోదకుల్లో మార్పు తీసుకొస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని కోర్టు మెట్టు ఎక్కించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.