కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తిరిగి పార్లమెంట్‌కు రావడం దేశానికి ఎంతో అవసరం అని వైఎస్ షర్మిల(YS Sharmila) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు షర్మిల ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. దేశంలో న్యాయం, ధర్మం గెలిచాయనడానికి సుప్రీంకోర్టు తీర్పే ఉదాహరణ అని అన్నారు. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ మళ్లీ పేదల కోసం తన గళం వినిపిస్తారని దేశం ఎదురుచూస్తోందని షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ పోరాట పటిమ ఎంతో ఆదర్శమని కొనియాడారు. దేశ భద్రత, ఐక్యతపై నాయకులు అందరూ కలిసి పోరాడాలని అభిప్రాయపడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తిర్మాణానికి తన నైతిక మద్దతు తెలియజేస్తున్నా అని తెలిపారు.
YS Sharmila | పేదల కోసం రాహుల్ గాంధీ మళ్లీ గళం విప్పాలి
-