గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh)కు చేదు అనుభవం ఎదురైంది. నూతన సచివాలయం లోపలకి వెళ్లనీయకుండా రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారని.. అందుకే సచివాలయానికి వచ్చానని రాజాసింగ్ తెలిపారు. తనను చర్చలకు పిలిచి తలసాని అవమానించారని వాపోయారు. ఎమ్మెల్యేలకే సెక్రటేరియట్లోకి అనుమతి లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనంతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను కూడా అనుమతించకపోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -
Read Also: ఫోన్‌పేలోకి UPI లైట్ ఫీచర్ వచ్చేసింది.. ఎలా వాడాలో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter