Rajagopal reddy: అదేగాని జరగకపోతే.. నా పేరు మార్చుకుంటా: రాజగోపాల్‌ రెడ్డి

-

Rajagopal reddy sensational comments on CM KCR and his Family: రాజగోపాల్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్లకపోతే.. తన పేరు మార్చుకుంటా అని సవాల్‌ చేశారు. ప్రజల సొమ్ము దోచుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లటం ఖాయమని జోస్యం చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ఆదరణ చూసే.. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాను తెరపైకి తెచ్చారంటూ దుయ్యబట్టారు. లిక్కర్‌ స్కామ్‌లో కవితన రక్షించటం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రమిస్తున్నారని ఆరోపించారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని కోమటిరెడ్డి రోజగోపాల్‌ రెడ్డి (Rajagopal reddy) సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూసిన రాజగోపాల్‌ రెడ్డి.. నైతిక విజయం తమదేనని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ సన్యాసం ఎప్పుడు రాజగోపాల్‌ రెడ్డి అంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేరు మార్చుకుంటా అని మళ్లీ సవాల్‌ చేయటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kishan Reddy | ‘14 నెలల్లో రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన ఘనుడు రేవంత్’

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని...

Revanth Reddy | రాజకీయ పావుగా పాలమూరు: రేవంత్

గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి...