Rajgopal Reddy: చెల్లెమ్మా నువ్వు జైలుకెళ్లడం ఖాయం!

-

Rajgopal Reddy MLC Kavitha Twitter War: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఎమ్మెల్సీ కవిత కు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ, నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం.. జైలుకెళ్లడం ఖాయమంటూ రాజగోపాల్ రెడ్డి కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిన్ను మీ అన్న, మీ నాయనా, ఎవరూ కాపాడలేరంటూ కౌంటర్ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కోల్ బ్లాక్ టెండర్ లో పారదర్శకంగా వచ్చిన రూ. 18000 కోట్లపై.. దృష్ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. అవినీతిమయమైన మీ కుటుంబం త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు.

- Advertisement -

అయితే, ఉదయం నుండే రాజగోపాల్ రెడ్డి, కవిత(MLC Kavitha) మధ్యన ట్విట్టర్ వేదికగా వైరం మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) లో కవిత ప్రమేయంపై వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్ ను షేర్ చేస్తూ.. ‘లిక్కర్ రాణి పేరును 28 సార్లు ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది’ అంటూ పోస్ట్ చేశారు రాజగోపాల్ రెడ్డి(Rajgopal Reddy). దీనిపై స్పందించిన కవిత “రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు !! ” 28 సార్లు ” నా పేరు చెప్పించినా ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail అనే ట్యాగ్ లైన్ తో కౌంటర్ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా రాజగోపాల్ రెడ్డి నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా అంటూ రీ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...