గుజరాత్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బుచ్చిరాములు ఎన్నిక

-

గుజరాత్(Gujarat) ప్రాంతీయ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాపోలు బుచ్చి రాములు(Rapolu BuchiRamulu) నియమితులయ్యారు. ఈయన తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా కొడకండ్ల ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం సూరత్ లో నివాసం ఉంటున్నారు. గతంలో బుచ్చిరాములు గుజరాత్ ప్రాంతీయ పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉత్తమ సేవలు అందించారు. బుచ్చిరాములు ప్రస్తుతం మార్కండేయ పద్మశాలి జనరల్ సమాజం సూరత్ కు, శీతల్ మాతా మందిరం ట్రస్ట్ కు సలహాదారునిగా, సూరత్ తెలుగు ఆదర్శమిత్రమండలి ప్రధాన కార్యదర్శిగా, లింబాయత్ వార్డు నెం. 25 బిజెపి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఆయన ఇప్పుడు పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడంతో పలువురు పద్మశాలి పెద్దలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన గుజరాత్(Gujarat) ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోనే సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిగేటి నాగేశ్, చక్కని నరసయ్య దాసరి శ్రీనివాసులతోపాటు.. అహ్మదాబాద్, నవసారి, బిల్లిమోర, గణదేవి సూరత్ పద్మశాలి వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also: యూపీలో వరుస ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...