Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’

-

తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth Reddy) స్పందించారు. తాను ఢిల్లీ వెళ్తున్న ప్రతిసారీ కూడా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని మీడియా తెరపైకి తెస్తుందని, ఈరోజు కూడా అదే పని జరిగిందని చెప్పారు. కానీ తాను ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న కారణం రాజకీయ సంబంధితం కాదని, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) కూతురు వివాహ వేడుకకు హాజరుకావడానికేనని స్పష్టం చేశారు. కానీ ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్ర మంత్రులతో పలు అంశాలపై చర్చిస్తానని చెప్పారు. అదే విధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఎంపీలతో మంగళవారం భేటీ అవుతానని వివరించారు.

- Advertisement -

ఇంకా Ravanth Reddy ఏమన్నారంటే..

రేపు తెలంగాణ లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో లేవనెత్తాల్సిన అంశాలపై వారితో చర్చిస్తాం..

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తాం.

రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతుల కోసం రేపు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తాం.

కొంతమంది అర్రాస్ పాటలా నా పర్యటనకు లెక్కలేస్తున్నారు..

నేనేమీ మీలా మోదీ(PM Modi) ముందు మోకరిల్లాడానికి ఢిల్లీకి వెళ్లడం లేదు..

ఎవరి కాళ్ళో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో నేను ఢిల్లీ వెళ్లడం లేదు.

గత పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది.

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు..

రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ తన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదు… కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుంది.

రాజకీయ పక్షపాతం చూపకుండా వారిని వెళ్లి కలిసినపుడే నిధులు రాబట్టుకోగలం

ఇందుకోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతాం.

మీ కడుపు మంట, దుఃఖం మాకు తెలుసు.. మీ కాకి గోలను మేం పట్టించుకోము..

ఇది ఒకరిపై కోపం, పగ చూపాల్సిన సమయం కాదు..

కార్యదీక్షతో తెలంగాణ అభివృద్ధి కోసం మేం ముందుకు వెళతాం.

అదానీ ఫ్లైట్ లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు

పెట్టుబడుల విషయంలో ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చము

కేసీఆర్‌లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు.

అదానీతో ఇన్ని ఒప్పందాలు చేసుకున్న వారూ మాపై ఆరోపణలు చేస్తున్నారు.

మహారాష్ట్ర నాందేడ్ లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది..

వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది..

రాష్ట్రానికి ఒకరకంగా కేంద్రానికి ఒక రకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు.

దేశంలో ఎక్కడ చూసినా బీజేపీని తిరస్కరించారు..

బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడంలేదు.

ఆయన ఒక సైకో రామ్.. సైకో రామ్ గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదు అని అన్నారు.

Read Also: జైలుకెళ్లడానికి కేటీఆర్ తపనపడుతున్నారా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...