Paper Leak Case |టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఐదేళ్లు డీబార్ అయిన విద్యార్థి హరీష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన కుమారుడి తప్పు లేదని అమాయకుడైన తన కుమారుడిపై డిబార్ వేటు పడిందని హన్మకొండ జిల్లా సీతారాంపూర్ గ్రామానికి చెందిన హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. అమాయకుడైన తన కుమారుడిని ఐదేళ్లు డిబార్ చేయడం వల్ల భవిష్యత్‌కు అన్యాయం జరుగుతుందని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.
Paper Leak Case |దీనిపై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం నుంచి హరీష్‌ను పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఎల్లుండి నుంచి హరీష్ పరీక్షలు రాసే అవకాశం లభించింది. కాగా, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిపై అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు సైతం దిగి రాజకీయ వేడిని పెంచారు.
Read Also: అప్పటి నుంచి ఢిల్లీలో డీజిల్, పెట్రోల్ వాహనాలకు నో ఎంట్రీ
Follow us on: Google News, Koo, Twitter