బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. కారును పోలిన ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్, రోడ్డు రోలర్ గుర్తులను తెలంగాణ(Telangana)తో పాటు, ఏపీలోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి కారు, మజ్లిస్ పార్టీకి గాలిపటం, టీడీపీకి సైకిల్, వైసీపీకి సీలింగ్ ఫ్యాను గుర్తులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏపీలో టీడీపీకి సైకిల్, వైసీపీకి ఫ్యాన్ గుర్తులను ఖరారు చేసింది. జనసేన పార్టీకి షాకిస్తూ ‘గాజు గ్లాసు’ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.
కాగా తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తులు బీఆర్ఎస్‌కు కొంత షాకిచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆ గుర్తులకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లతో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు పలుమార్లు ఆ గుర్తును నిషేధించాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: ఎవరు ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది?
Follow us on: Google News, Koo, Twitter