ఆ నలుగురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

-

కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దేశంలో మోడీ(Modi) బ్రాండ్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. ఈడీ, సీబీఐతో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన మోడీని కర్ణాటక ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు. మోడీతో సహా కేంద్ర మంత్రులంతా కర్ణాటకలో మోహరించారని, జై భజరంగబలి, ముస్లిం రిజర్వేషన్లు, కులాల విభజన తెచ్చి కుట్ర పూరితంగా గెలవాలని ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. అయినా, మోడీ కుట్రలను తిప్పికొట్టి కర్ణాటకలో కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారని తెలిపారు.
అంతేగాక, కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్(KCR) చేసిన కుట్రలను తాము బయటపెట్టామని, ఈ క్రమంలోనే కర్ణాటక(Karnataka) ప్రజలు కేసీఆర్ నడుములు విరిగే తీర్పు ఇచ్చారని సెటైర్లు వేశారు. అంతేగాక, ఇటీవల రాష్ట్రంలో వివేక్ వెంకటస్వామి, ఈటల, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీతో కలిశారని, కానీ బీజేపీ వారిని నమ్మదు, వారు బీజేపీని నమ్మరని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి.. అందుకోసం అందరినీ కాంగ్రెస్‌(Congress)లోకి ఆహ్వానిస్తున్నట్లు రేవంత్(Revanth Reddy) బహిరంగంగా ప్రకటించారు. పార్టీ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా తాను సిద్ధమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని అందరినీ అక్కున చేర్చుకుంటదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...