KCR | కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

-

అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “శాసన సభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో తన పాత్రను పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి.. తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా సభను సజావుగా నడవడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నా” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

మరోవైపు కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఘనంగా సెలబ్రేట్ చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో పార్టీ శ్రేణులు 70 కేజీల కేక్‌ కట్‌ చేశారు. అంతేకాదు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు యాక్సిడెంట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కింద లక్ష రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...