మంత్రి కేటీఆర్ కి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

-

Revanth Reddy – KTR | తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కి నిధులు సమకూర్చేందుకు కర్ణాటకలో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్లకు చదరపు అడుగుకి రూ.500 పన్ను విధిస్తోందని ఆరోపించారు. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయి, స్కాం లు చేయడం ఆ పార్టీకి అలవాటని, అందుకే ఆ పార్టీని స్కాంగ్రెస్ అంటరాని విమర్శించారు. అంతకుముందు శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. BRS పార్టీవి స్కీములని, కాంగ్రెస్ పార్టీవి స్కామ్ లని, బీఆర్ఎస్ అంటే సాగునీళ్లని కాంగ్రెస్ అంటే కన్నీళ్లని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే ఇరిగేషన్ అని, కాంగ్రెస్ అంటే మైగ్రేషన్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారెంటీలని, ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కాగా, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -

“కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు.. దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు” అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేటీఆర్ ని నిలదీశారు.

“లిక్కర్ స్కామ్(Liquor Scam) లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు.. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చ.అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు అంటూ కేటీఆర్ కి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

Read Also: సోషల్ మీడియాలో సంపాదిద్దాం అనుకుంటున్నారా.. మీకో గుడ్ న్యూస్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...