Revanth Reddy | మీరు 10 ఇస్తే మేము 80 ఇస్తాం: రేవంత్ రెడ్డి

-

ఖమ్మంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జనగర్జన సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ వేదికపై రాహుల్ గాంధీ సమక్షంలో జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీ తో పాటు ఇతర హస్తం నేతలు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటి చేరికపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ.. పొంగులేటి చేరికతో ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

ఖమ్మం సభకు ప్రజలను రానీయకుండా అధికార ప్రభుత్వం అడ్డుగోడలు కట్టిందని, ఆ గోడలను దుంకి, అడ్డొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను కొట్టుకుంటూ వచ్చి ఖమ్మం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు అంటూ హాజరైన జనాన్ని ఉత్సాహపరిచారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని, అదే రోజు సోనియమ్మ పుట్టినరోజు అని, అదే రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. మీ అందరి తరపున రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మాట ఇస్తున్నానని రేవంత్(Revanth Reddy) అన్నారు. ఇక అదే రోజున కాంగ్రెస్ పార్టీ విజయోత్సవసభ ఖమ్మం గడ్డపై జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మీరు 10 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో 80 సాధించే బాధ్యత మాది అని ఖమ్మం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Read Also:
1. జనగర్జన సభలో ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ భారీ హామీ
2. కేసీఆర్ తెలంగాణకు రాజులా ఫీలవుతున్నాడు: రాహుల్ గాంధీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...