Janagarjana Sabha | జనగర్జన సభలో ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ భారీ హామీ

-

Khammam Janagarjana Sabha | కర్ణాటకలో గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణలోనూ విజయకేతనం ఎగరేసేందుకు రాజకీయ ఎత్తుగడలకు పదును పెంచింది. ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టింది. తెలంగాణలోని బడా నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy)ని తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఆదివారం ఖమ్మం లో ఏర్పాటు చేసిన జనగర్జన సభ(Janagarjana Sabha)లో పొంగులేటి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలే లక్ష్యంగా భారీ హామీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

- Advertisement -

తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది..

భారత్ జోడో యాత్ర తర్వాత TSకు రావడం ఎంతో సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఆ యాత్రలో పాల్గొన్న రాష్ట్ర ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ‘దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు యాత్ర చేశాను. మన ఐడియాలజీ దేశాన్ని కలపడం.. ఇతరుల సిద్ధాంతం దేశాన్ని విడదీయడం’ అని పేర్కొన్నారు. వేల కిలోమీటర్లు యాత్ర చేసిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. BRSను విభేదించి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటికి స్వాగతం పలికారు.

తిరిగి రావాలంటూ పిలుపు..

కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని పడగొట్టామని రాహుల్ తెలిపారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి అక్కడ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని వివరించారు. ఇక్కడ కూడా నేతలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తిరిగిరావాలని కోరారు. వారి కోసం కాంగ్రెస్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని చెప్పారు.

అధికారంలోకి వస్తే రూ.4వేల పెన్షన్..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల చొప్పున పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ భారీ ప్రకటన చేశారు. తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. పేదల కలలను కేసీఆర్ నాశనం చేశారు. భూములను దోచుకోవడానికే ధరణిని తెచ్చారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో రూ. వేల కోట్లు దోచుకున్నారు అని మండిపడ్డారు.

Read Also:
1. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి.. ఆహ్వానించిన రాహుల్ గాంధీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....