Allu Arjun | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ డైరెక్టర్‌తో నెక్ట్స్ సినిమా!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా.. అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. పుష్ప-2 తర్వాత త్రివిక్రమ్‌(Trivikram)తో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అంతేగాక, త్వరలోనే ఈ మూవీపై అప్డేట్ రానుంది. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్. ఇప్పటికి మూడు చిత్రాలకు కలిసి పనిచేశారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఓ మోస్తరు విజయాలు సాధించాయి. హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసి 2020 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. కెరీర్లో మొదటిసారి అల్లు అర్జున్(Allu Arjun) అతిపెద్ద విజయం చూశాడు. దీంతో మరో హిట్ కోసం వీరిద్దరు సిద్ధమవుతున్నారు.

- Advertisement -
Read Also:
1. పవన్ కల్యాన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఉస్తాద్ భగత్ సింగ్ అప్‌డేట్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...