RS Praveen Kumar |టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొన్నేళ్లగా ఇళ్లకు దూరమై కోచింగ్ సెంటర్లకు పరిమితమైన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతోన్న నిరుద్యోగులు ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై బీఎస్సీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మార్చి 11న జరిగిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీని TSPSC చిన్న విషయంగా చూపించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని తాము నిరాహార దీక్షకు కూర్చుంటే.. దాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును చిన్న విషయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌పై ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతి సభ్యులకు ఈ పేపర్ లీక్‌లో సంబంధం ఉన్నట్లు తెలుస్తుందన్నారు.
Read Also: కష్టకాలంలో ఉన్నా.. మీ ఆశీస్సుల కోసం వచ్చా: కోటంరెడ్డి
Follow us on: Google News Koo