RS Praveen Kumar |టీఎస్ ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ జాబ్‌లో కూడా స్కాం జరిగిందని వస్తున్న వార్తలపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కుంభకోణంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేయాలన్నారు. అల్మారాలో ఎన్నో అస్థిపంజరాలు ఉన్నాయని అంటూ పేర్కొన్నారు. తెలంగాణ యువత భవిష్యత్తును కాపాడేందుకు నిజానిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరారు. ఇదిలా ఉండగా పేపర్ లీకేజీలు కొత్తేంకాదు అన్న మంత్రి జగదీశ్ రెడ్డి మాటలకు ఆర్ఎస్పీ స్పందిస్తూ.. అందుకేనా సింగరేణిలో, ట్రాన్స్కోలో పేపర్లు లీక్ చేయించారు? అంటూ ట్వీట్ చేశారు.
Read Also: సెన్సేషనల్ న్యూస్.. వెస్డిండీస్‌కు చుక్కలు చూపించిన సౌతాఫ్రికా
Follow us on: Google News, Koo, Twitter