RS Praveen Kumar| బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా.. BRS లో చేరిక..?

-

తెలంగాణ రాజకీయాల్లో వరుసగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

“పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. రాజీనామా తప్ప మరో మార్గం కనిపించడం లేదు”అని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూల్ సీట్లు బీఎస్పీకి కేటాయించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీకి రాజీనామా చేయడంతో బీఎస్పీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. తర్వలోనే బీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...