కేసీఆర్ సర్కార్ కు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొట్లాడి సాధించున్న రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అందరి తెలంగాణ కాదని కొందరి తెలంగాణ మాత్రమే అని అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతి(Mayawati) నాడు 36 మంది సభ్యులతో తెలంగాణ కు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.
అమరవీరుల కలల సాధ్యం అయ్యే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ లోని వంద ఏళ్ళ సంపదను కేసిఆర్ కుటుంబం పది ఏళ్లలో కైవసం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రం అప్పులపాలు ఐనది అని అన్నారు. నిరుద్యోగ సమస్యల మీద ఒక్క మాట సీఎం మాట్లాడలేదన్నారు. టీఎస్పీఎస్సీ(TSPSC) అసలు దొంగల్ని పట్టుకోకుండా ఇప్పుడు చిన్నచిన్న వాల్లని అరెస్ట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. జూన్ 11 న జరిగే గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ అగ్గి గుండం అవుతుందని హెచ్చరిక చేశారు. తెలంగాణ లో వలసలు లేవు అని చెబుతున్నారు.. నాతో రాండి సీఎం వలసలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాం… అని ఆర్ఎస్పీ(RS Praveen Kumar) మండి పడ్డారు.