అదిరిపోయిన మెగాస్టార్ ‘భోళా శంకర్’ ఫస్ట్ సింగిల్.. బాస్ లుక్స్ అదుర్స్!

Bhola Shankar

గాడ్ ఫాదర్, వాళ్తేరు వీరయ్య వంటి వరుస హిట్లతో మెగాస్టార్ చిరంజీవి మాంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వoలో భోళా శంకర్(Bhola Shankar) సినిమా చేస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ లుక్స్ ఫాన్స్ లో మాంచి హైప్ క్రియేట్ చేసాయి. తాజాగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి సాంగ్ ను జూన్ 4th కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రోమోలో వింటేజ్ లుక్ లో మెగాస్టార్ అదరగొట్టారు. దీంతో పూర్తి సాంగ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నామంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ సినిమా(Bhola Shankar) ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also:
1. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన అబ్బాయ్ బాబాయ్ 
2. పిల్లల భవిష్యత్‌ మీ తీరుపై ఆధారపడి ఉంటుంది..!

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here