తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన అబ్బాయ్ బాబాయ్ 

Pawan Kalyan

Pawan Kalyan – Ram Charan |తెలంగాణ అవతరణ దశాబ్ది దినోత్సవ వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ప్రజలకు విషెస్ చెప్పారు. ‘తెలంగాణ స్టేట్ ఏర్పాటు అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. దశాబ్ధి వేడుకల సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాము’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also:
1. త్వరలోనే వారాహితో జనాల్లోకి రానున్న జనసేనాని 
2. హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదు: గవర్నర్ తమిళిసై 
Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here