కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) చీఫ్ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ను కోరారు. 2018 లో గజ్వేల్ నుండి పోటీ చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిటీ లో ఉద్దేశ్యపూర్వకంగానే స్థిరాస్తుల వివరాలను వెల్లడించలేదని ఆర్ఎస్పీ ఆరోపించారు. కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిటీలో చూపారు కానీ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను తెలపలేదని అన్నారు. ప్రజాప్రాతిధ్య చట్టం – 1951 నిబంధలను కావాలనే ఉల్లంఘించి ఆస్తుల వివరాలను దాచిన కేసీఆర్(KCR) పై క్రిమినల్ కేసు నమోదు చేసి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని సీఈసీ కోరారు.
మీడియా ప్రకటన
తేదీ: 05 -11- 2023
స్థలం:బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం,
లక్డీకాపూల్, హైదరాబాద్కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకోవాలి:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
2018 ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో స్థిరాస్తుల వివరాలు ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని… pic.twitter.com/kDULTfS8Kz
— BSP4Telangana (@BSP4Telangana) November 5, 2023