ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా.. ఈ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD Sajjanar) స్పందించారు. ‘బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్‌ను ఆర్టీసీ బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా(Mugulu District) మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలి. ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.’ అని సజ్జనార్(Sajjanar) ప్రయాణికులకు సూచించారు.
Read Also:
1. బీసీలకు లక్ష సాయంపై సర్కార్ గుడ్ న్యూస్
2. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ చోరీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat