సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు

0
Cantonment Board Elections

Cantonment Board Elections |సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్‌ను కేంద్రం రద్దు చేసింది. అయితే కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ గత నోటిఫికేషన్‌లో పేర్కొంది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఆరు నెలల పాటు వాయిదా వేయాలని నామినేటెడ్ సభ్యులు కోరడంతో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీ విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్ కొనసాగుతోంది. బోర్డు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వేసిన పిటిషన్‌పై ఈనెల 23న విచారణ జరగనుంది.

Read Also: ‘ఏపీ సీఎం జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే’

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here