‘సికింద్రాబాద్ విధ్వంసం కేసు..సుబ్బారావు కనుసన్నల్లోనే అల్లర్లు’

0
117

కుట్ర కోణంలోనే సికింద్రాబాద్ అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసు, సుబ్బారావు అరెస్టులో కీలక ఆధారాలు లభించాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులను అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు వివరాలను వెల్లడించారు.

సికింద్రాబాద్ అల్లర్ల వెనకాల సుబ్బారావు పాత్ర ఉంది. సికింద్రాబాద్‌కు అభ్యర్థులను సుబ్బారావే తరలించాడు. సికింద్రాబాద్‌ సమీపంలోని 8 ఫంక్షన్‌ హాళ్లలో అభ్యర్థులను పెట్టాడు. సుబ్బారావు కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు తెలిపారు.

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకంతో తనకు నష్టం వచ్చినట్లు సుబ్బారావు తెలిపినట్లు తెలుస్తోంది. రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు 50కోట్ల రూపాయలు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అందుకే అభ్యర్థులను రెచ్చగొట్టి విధ్వంసానికి పథకం పన్నాడు.