Revanth Reddy |టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పందించింది. సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పేపర్ లీక్‌పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు.
ఇందులో కేటీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్,మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్(Revanth Reddy) ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని సిట్ కోరింది.
Read Also: రైతులను పట్టించుకోని సర్కారు మనకు అవసరమా?: షర్మిల
Follow us on: Google News Koo