Gold Rate | ఈ వేసవిలో కేవలం ఎండలే కాదు ధరల చార్టులలో బంగారం కూడా పైకి దూసుకుపోతోంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర బుధవారం 90,440 రూపాయల ఉండగా గురువారానికి 90,660 రూపాయలకు చేరుకుంది. కేవలం ఒక రోజులోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగిందని నగల వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం ధరలతో పోల్చి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 660, 22 క్యరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 600 పెరిగినట్లు తెలిపారు.
మార్చి 18న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,000 మార్కును చేరుకోగా కేవలం రెండు రోజుల్లోనే రూ. 660 పెరిగింది. నగరంలోని బంగారం పరిశ్రమ పరిశీలకులు రాబోయే కొన్ని వారాల్లో ధరల చార్టులలో బంగారం ధర అప్పుడప్పుడు కొద్దిగా హెచ్చుతగ్గులకు లోనవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతుందని భావిస్తున్నారు. బంగారం ధరలు త్వరలో రూ. లక్షకు చేరుకుంటాయని మార్కెట్‌లో కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఊహించినంత త్వరగా ఇది జరగకపోవచ్చు అని చెబుతున్నారు.
హైదారాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదుర్కొంటున్న స్తబ్దత, అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్‌లో చర్చ కూడా ఉంది. కొన్ని నెలల డేటా చూస్తే గత ఒక నెలలో 10 గ్రాముల 24k బంగారం ధర రూ. 2,500 కంటే ఎక్కువ, గత మూడు నెలల్లో దాదాపు రూ. 7,300 పెరగడం చూడవచ్చు. స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పసిడి ధర పెరుగుతూనే ఉంది.
గత 10 రోజుల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల 24 వేల బంగారం ధరలు(Gold Rate):
మార్చి 11: రూ. 87,490
మార్చి 12: రూ. 87,980
మార్చి 13: రూ. 88,580
మార్చి 14: రూ. 89,780
మార్చి 15: రూ. 89,670
మార్చి 16: రూ. 89,670
మార్చి 17: రూ. 89,560
మార్చి 18: రూ. 90,000
మార్చి 19: రూ. 90,440
మార్చి 20: రూ. 90,660