టెన్త్ విద్యా్ర్థుల జవాబు పత్రాలు మాయం.. రంగంలోకి కలెక్టర్

-

Answer Sheets Missing |ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోన్న వేళ రాష్ట్రంలో మరో కలకలం రేగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలో పదోతరగతి జవాబు పత్రాల గల్లంతు వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గల్లంతు అయిన జవాబు పత్రాలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలుగా భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎగ్జామ్ అనంతరం అధికారులు జవాబు పత్రాలను పోస్టాఫీస్‌కు తరలించారు. మొత్తం జవాబు పత్రాలను తమ సిబ్బందితో ఆర్ఎంఎస్ పార్సెల్ చేసేందుకు ఆటోలో బస్టాండ్‌కు పంపినట్లు సబ్ పోస్టు మాస్టర్ చెప్పారు. అయితే ఆటో బస్టాండ్‌కు వెళుతున్న మార్గమధ్యంలోనే 9 జవాబు పత్రాల(Answer Sheets Missing) బండిల్ పడిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది జవాబు పత్రాల చేరవేతలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా(Additional Collector Rizwan Basha), జిల్లా విద్యాధికారి ప్రణీత తదితరులు ఉట్నూర్ చేరుకుని విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
Read Also: సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ వీధి కుక్క దాడి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...