TS: పదవ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు మాయం?

-

Answer Sheets Missing |పదో తరగతి విద్యార్థుల పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే రాష్ట్రంలో ప్రశ్రాపత్రాలు లీక్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనను మరువకముందే రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఏకంగా జవాబు పత్రాల కట్ట ఒకటి మాయం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం ఎగ్జామ్‌ రోజే జిల్లాలోని ఉట్నూరులో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉట్నూరులో మొత్తం 1011 మంది పదవ తరగతి విద్యార్ధుల కోసం ఐదు ఎగ్జామ్స్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేశారు. పరీక్ష ముగియగానే విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ఆయా ఎగ్జామ్స్‌ సెంటర్ బాధ్యులు పోస్ట్ ఆఫీస్‌లో అప్పజెప్పారు. అయితే పోస్టల్ సిబ్బంది జవాబు పత్రాలన్నింటినీ 11 కట్టలుగా వేరు చేసి ఇన్విజిలేషన్‌ కేంద్రాలకు తరలించేందుకు ఆటోలో బస్టాండ్‌కు తెచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి లెక్క బెట్టడంతో ఆన్సర్ పేపర్స్‌(Answer Sheets Missing) బండిల్స్‌లో 11బదులు 10 మాత్రమే ఉండటంతో షాక్ అయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Read Also: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...