హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

-

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో(Hyderabad Metro) యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఇవాల్టి నుంచి రాయ్‌దుర్గ్‌ మెట్రో స్టేషన్‌లో ఆర్మ్‌–బీ, నాల్గో ద్వారం కూడా తెరువనున్నట్లు వెల్లడించింది. ఈ విభాగం కూడా తెరవడంతో, మెట్రో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా, మరీ ముఖ్యంగా రద్దీ వేళల్లో స్టేషన్‌లోకి వెళ్లడం సులభతరం అవుతుంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లలో రాయ్‌దుర్గ్‌(Rayadurgam) మెట్రో స్టేషన్‌ ఒకటి. ఈ స్టేషన్‌ నుంచి ప్రతి రోజూ దాదాపు 60వేల మంది ప్రయాణీకులు రాకపోకలు చేస్తుంటారు. ఈ నూతన ద్వారానికి మెట్ల మార్గంతో పాటుగా ఎస్కలేటర్‌ కూడా ప్రయాణీకుల రాకపోకలకు సహాయపడతాయి. ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఎన్‌వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ రాయ్‌దుర్గ్‌ మెట్రో స్టేషన్‌ నాల్గవ ద్వారాన్ని ప్రజలకు అంకితం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. దీంతో ప్రయాణీకులు మరింత సౌకర్యవంతంగా స్టేషన్‌లోకి వెళ్లడంతో పాటుగా మరింత మెరుగైన హైదరాబాద్‌ మెట్రో రైల్‌(Hyderabad Metro) అనుభవాలను పొందగలరు’’ అని అన్నారు.

- Advertisement -
Read Also: నాని దసరా సినిమాపై రాజమౌలి ప్రశంసల వర్షం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...