తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్?

-

Paper leak |తెలంగాణలో పేపర్ లీకేజీలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ ఘటన మరువకముందే నేడు టెన్త్ పరీక్షాపత్రం లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో పేపర్ లీక్ జరిగినట్లు తెలుస్తోంది. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై అధికారులకు సమాచారమిచ్చిన పట్టించుకోలేదు. మరోవైపు పేపర్ లీకేజ్‌తో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా డీఈవోని ప్రశ్నించగా.. పేపర్ లీక్ కాలేదని సమాధానమిచ్చారు. పేపర్ లీక్ అయిందా? కాలేదా? అనే విషయమై కాసేపట్లో ఉన్నతాధికారులు వివరణ ఇవ్వనున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -
Read Also: పరగడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...