రైలులో దారుణం.. ప్రయాణికుడుకి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

-

Kerala |రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి తోటి ప్రయాణికుడికి నిప్పటించండంతో మంటలు పక్కన వాళ్లకు వ్యాపించి మొత్తం ముగ్గురు మృతిచెందారు. ఆదివారం అర్థరాత్రి కోజికోడ్ జిల్లా ఎలత్తూర్ సమీపంలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అలప్పుళ-కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం రాత్రి 9.45 గంటలకు కోజికోడ్​ నగరం దాటి కొరపుజా రైల్వే బ్రిడ్జి దాటుతుండగా డీ1 కాంపార్ట్​మెంట్​లో ఎర్ర చొక్కా, టోపీ ధరించి ఉన్న ఓ వ్యక్తి, తోటి ప్రయాణికులపై రెండు బాటిళ్ల పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. దీంతో డీ1 బోగీలో చెలరేగిన మంటలు డీ2 కంపార్ట్​మెంట్​కు కూడా వ్యాప్తించాయి.

- Advertisement -

భయాందోళనకు గురైన ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్​ లాగి రైలును ఆపారు. ఈ నేపథ్యంలో దాదాపు 35 ఏళ్ల వయసున్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనలో 9 మంది క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించినట్లు కోజికోడ్ నగర పోలీసు కమిషనర్ రాజ్‌పాల్ మీనా తెలిపారు. అయితే, ఇందులో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి, తన బంధువుల్లో ఓ చిన్నారి, మరో మహిళ  కనిపించడం లేదని అన్నాడు. ఈ విషయమై పోలీసులు రైలు పట్టాలను పరిశీలించగా, ఆదివారం అర్ధరాత్రి కేరళ(Kerala) లోని ఎలత్తూరు రైల్వే స్టేషన్​ సమీపంలోని పట్టాలపై ఓ చిన్నారి, మహిళ సహా, మరో వ్యక్తి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను కోజికోడ్​ మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Read Also: రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సిన డిన్నర్ టీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...