టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల.. మహిళలకు వరాలు..

-

టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్‌ను ఆవిష్కరించారు. గతంతో సూపర్‌ సిక్స్‌ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రకటించగా.. ఇప్పుడు జనసేన షణ్ముఖ వ్యూహం కూడా కలిసి మరికొన్ని హామీలను జోడించారు. ‘నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం’ నినాదంతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.

- Advertisement -

TDP-Janasena-BJP మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

⇨ మెగా డీఎస్సీపై మొదటి సంతకం

⇨ సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

⇨ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

⇨ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

⇨ దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

⇨ బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

⇨ అమరావతి నిర్మాణం ప్రారంభం

⇨ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

⇨ యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

⇨ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

⇨ తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

⇨ రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

⇨ వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

⇨ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం

⇨ ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

⇨ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

⇨ భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

⇨ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

⇨ పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

⇨ పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ

⇨ ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ

⇨ ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం

⇨ మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం..

⇨ స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు

⇨ డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

⇨ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు

⇨ ‘కలలకు’ రెక్కలు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు

⇨ ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ

⇨ ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు

⇨ చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

⇨ బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు

⇨ ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం

⇨ ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం

⇨ కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

⇨ ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు

⇨ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం

⇨ ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం

⇨ దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

⇨ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు

⇨ వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు

⇨ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు

⇨ జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ.

Read Also: తెలంగాణ గోబెల్ కేసీఆర్.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...